హీరో అడివి శేష్ ‘గూఢచారి', 'ఎవరు’ లాంటి సినిమాలతో వరుస విజయాల్ని అందుకున్నడు. అడివి శేష్ ఆ తరహాలోనే ‘మేజర్’ అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా కథ ఉండనుంది. అదే 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై మహేష్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈరోజు శేష్ పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ ‘మేజర్’ చాలా బాగా వస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. సో.. మహేష్ అంత నమ్మకంగా ఉన్నారంటే సినిమా మంచి స్థాయిలోనే ఉంటుందని అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేయనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa