ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అ’ సినిమాలో నాని ఇలా ఉంటాడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 23, 2017, 02:21 PM

ఇటీవలే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాతో పలకరించాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా గురించి చర్చలు నడుస్తుండగా.. నాని తన కొత్త సినిమా లుక్ లో సోషల్ మీడియాలోకి దిగాడు. నాని సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ నిర్మిస్తున్న ‘అ’ సినిమాలో అతడి పాత్రను ఈ రోజు పరిచయం చేశారు. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడు ఈ సినిమా. మనిషిగా ఉన్న నాని.. చేపగా మారిపోయాడు ఈ సినిమా కోసం.


అవునండీ.. ఈ చిత్రంలో నాని పోషిస్తున్నది చేప పాత్రే. ‘అ’ టైటిల్ లోగో లాంచ్ చేసినపుడే నాని ఇందులో ఓ పాత్రకు వాయిస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత అతను వాయిస్ ఇచ్చేది ఒక చేపకు అని ప్రకటించారు. ఆ చేప ఫస్ట్ లుక్కే ఈ రోజు లాంచ్ చేశారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ నాని చేప చాలా అందంగా ఉంది.


ఈ సినిమాలో రవితేజ ఒక చెట్టుకు వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి మాస్ రాజా చెట్టు లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే అవసరాల శ్రీనివాస్.. రెజీనా కసాండ్రా.. ఈషా రెబ్బాల లుక్స్ పరిచయమయ్యాయి. కాజల్ సహా మిగతా నటీనటుల లుక్స్ కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa