నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. ఆయన హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా జనవరి 3న నుండి మొదలు కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుంది. షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. మే లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆ పాత్రకు కేథరీన్ థెరీసాని తీసుకోనున్నారట. అలాగే మరో అతిధి పాత్రలో హీరోయిన్ వేదిక కూడా కనిపించనుంది. అలాగే హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa