ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో సిద్ధార్ధ్ న్యూ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 12:26 PM

హీరో సిద్ధార్ధ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . వరుసప్లాపులతో ఆయన చిన్నగా మార్కెట్ కోల్పోయారు. ఐతే ఈ హీరో తమిళ్ లో మాత్రం వరుస చిత్రాలు చేస్తున్నారు. కాగా సిద్దార్థ్ నటిస్తున్న మరో తమిళ చిత్రం టక్కర్. దర్శకుడు కార్తీక్ జి క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవగా అందులో సిద్ధార్థ్ గత చిత్రాలకు భిన్నంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టక్కర్ విడుదల కానుంది. ఇక సిద్దార్థ్ భారతీయుడు 2 మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే మరో తమిళ చిత్రంలో ఆయన నటిస్తున్నారు.  హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో సిధార్థ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa