అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. అయితే ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వస్తున్నాయట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa