స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో తన తదుపరి చిత్రంపై చాలా కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు బన్నీ. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో బన్నీ తాజా చిత్రం తెరకెక్కుతుండగా ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం బన్నీ తన మేకొవర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ రోజు రాత్రి 10.30ని.లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa