ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లరి నరేశ్ ఆ సినిమాలో నటించట్లేదు అంట!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 29, 2019, 01:43 PM

డైరెక్టర్ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ, నభానటేశ్‌, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా వస్తున్న సినిమా డిస్కోరాజా. ఈ సినిమాలో అల్లరినరేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం సెకండ్‌ హాఫ్‌లో కీలకంగా ఉండే పాత్రలో అల్లరి నరేశ్‌ కనిపిస్తాడని టాక్‌. అయితే ఈ వార్తలపై డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ క్లారిటీ ఇచ్చాడు. డిస్కోరాజాలో అల్లరి నరేశ్‌ నటించడం లేదు. అల్లరి నరేశ్‌ నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపాడు. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ సింహా విలన్‌. . ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa