ప్రభాస్ ‘జాన్’ మూవీ షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పుడో మొదలవ్వాల్సిన షెడ్యూల్ ఇప్ఫటికే రెండు సార్లు వాయిదా పడింది. అయితే రీసెంట్ గా జనవరి మొదటి వారంలో చిత్రబృందం షూటింగ్ ప్లాన్ చేసింది . కానీ, ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది. జనవరి 17 నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరగనుంది. అదే షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా వన్ వీక్ షూటింగ్ జరుపుకోనుంది. కాగా `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుందని.. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa