మహేష్ బాబు-అనిల్ రావిపూడిల కలయికలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే సంచలనాలను సృష్టించిన ఈ సినిమా గురించి నిర్మాత అనిల్ సుంకర మీడియాకి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్మీ మేజర్ గా మహేష్ బాబు రోల్ సినిమాలోనే హైలైట్ అవుతుందని, ఆయన అభిమానులను ఆ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుందని అనిల్ సుంకర తెలిపారు. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ పూర్తిగా కొత్తగా ఉంటుందని ఈ స్టార్ ప్రొడ్యూసర్ వెల్లడించారు. కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa