ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను ఎవ్వరూ ఇలా చూడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 25, 2017, 04:19 PM

 ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో అమాయకపు పాత్రల్లో నటించి మెప్పించారు నటి రెజీనా. కానీ ఆమె తాజాగా నటిస్తున్న ‘అ’ చిత్రంలో మాత్రం ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో సందడి చేయబోతున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని నిర్మిస్తున్న చిత్రం ‘అ’. కాజల్‌, నిత్యా మేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని రెజీనా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతులు, వీపుపై టాటూలు, మోడ్రన్‌ కేశాలంకరణతో రెజీనా ఆకట్టుకున్నారు. అయితే తన గెటప్‌ను ఎవ్వరి కంటా పడకుండా ఉండటానికి చాలా జాగ్రత్తపడ్డానని అంటున్నారు.


‘ఈ గెటప్‌ కోసం నా స్టైలింగ్‌ టీమ్‌ 24 గంటలకు పైగా కష్టపడేవారు.ఈ లుక్‌ కోసం నా స్టైలిస్ట్‌ చాలా రీసెర్చ్‌ చేశారు. జులై నెలాఖరుకి నా ఓవరాల్‌ లుక్‌ పూర్తయింది. నన్ను ఎవ్వరూ ఇలా చూడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యేవరకు ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాను.’


 


‘దర్శకుడు ప్రశాంత్‌ సినిమా కథను నాకు వినిపించినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతోందో ఓ సీన్‌ వూహించేసుకున్నా. నన్ను ఇలా చూసి అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారని అనుకున్నాను కానీ మరీ ఇంతగా సర్‌ప్రైజ్‌ అవుతారనుకోలేదు.’ అని చెప్పుకొచ్చారు రెజీనా.


 


‘అ’ చిత్రంలో నాని చేప పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకు రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌పూర్తైనట్లు నిర్మాత నాని చెప్పారు. విభిన్న కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు తెరపైకి ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని తెలిపారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa