ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ నెక్స్ట్ సినిమా ఫిక్స్..!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2020, 07:55 PM

'భరత్ అనే నేను'.. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు, తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనీ, 'స్పై' పాత్రను ఆయన పోషించనున్నాడని అంటున్నారు.


గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' సినిమాలో మహేశ్ బాబు 'స్పై'గానే నటించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా అదే తరహా పాత్రను వంశీ పైడిపల్లి సినిమాలోను మహేశ్ చేయనుండటానికి సిద్ధపడితే నిజంగా అది సాహసమే అవుతుంది. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 27వ సినిమా .. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa