ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు అన్నారు. తాజాగా, జవాన్లతో కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఈ రోజు కూడా నిస్సందేహంగా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. మనల్ని ప్రతిరోజు కాపాడుతోన్న భారత హీరోలకు (జవాన్లకు) సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa