తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమే. కానీ బిజీ లైఫ్ వల్ల పుస్తకానికి దూరమైపోయానని ఆవేదన వ్యక్తం చేసింది నటి తమన్నా. అంతేకాదు తన లైఫ్ ని మార్చేసిన ఓ రెండు పుస్తకాల గురించి ప్రత్యేకంగా తెలిపింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను. అందుకు కారణం `ఓషో`. ఆ పేరు చదివితే చాలు.. అది నా జీవితానికి మేలి మలుపు లాంటిది. ఆధ్యాత్మికతను బాగా అర్థం చేసుకోవడానికి ఆ పుస్తకం నాకు సహాయపడింది. నా జీవనశైలి పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన మరో పుస్తకం రోరే ఫ్రీడ్మాన్ అండ్ కిమ్ బర్నౌయిన్ రాసిన `స్కిన్నీ బిచ్`. ఆ పుస్తకం చదివిన తర్వాతే నేను మాంసాహారం మానేశాను. శాఖాహారం తినడానికి ప్రేరేపించిన పుస్తకం అది అని వెల్లడించింది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa