మురళి శర్మ తన కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర ని అల వైకుంఠపురములో త్రివిక్రమ్ తనకి ఇచ్చాడని చెబుతున్నాడు. మరి ఆ సినిమాలో వాల్మీకి గా మురళీశర్మ నటనకు మంచి కాదు.. టాప్ మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ తర్వాత అంతగా పేరొచ్చింది కేవలం మురళి శర్మకే. వాల్మీకి -బంటు(అల్లు అర్జున్) మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. మరి అల్లు అర్జున్ ఓ భయంకరమైన నటుడని, సెట్ లో స్టార్ హీరోలా అస్సలు ప్రవర్తించడని, తనకి ఇచ్చిన పాత్రలో పూర్తిగా లీనమవుతాడని చెబుతున్నాడు. మరి అల వైకుంఠపురములో శాడిస్ట్ తండ్రిగా వాల్మీకి గా మురళి శర్మ పాత్రని ఇప్పట్లో అయితే ఎవరూ మర్చిపోలేరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa