టాలీవుడ్లోకి 'ఛలో' సినిమాతో పరిచయమైన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక మందన. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ప్రస్తుతం నితిన్‌తో భీష్మలో నటిస్తోంది. కాగా రష్మిక మరో ఆఫర్ కొట్టేసింది. తమిళ్‌లో సూర్య సరసన రష్మిక నటించనుంది. ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించనున్నాడు. మరోవైపు రష్మిక ప్రస్తుతం సూర్య సోదరుడు కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa