ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్ అలా చేయడం నాకు బాధకలిగిస్తుంది అంటున్న బన్నీ!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 01:13 PM

బన్నీ ఎదురు చూస్తున్న ఒక అతిపెద్ద హిట్, అల వైకుంఠపురంలో రూపంలో తన ఖాతాలో చేరింది. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో పాటు నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా అల వైకుంఠపురంలో సొంతం చేసుకుంది. మూవీ విడుదలై ఇరవై రోజులు దాటిపోతున్నా కూడా కలెక్షన్స్ జోరు కొనసాగుతుంది. అయితే ఓ సన్నివేశం కొరకు బన్నీ అల వైకుంఠపురంలో మూవీలో బీడీ తాగుతాడు. ఆ సన్నివేశంలో బీడీతో బన్నీ మాస్ మేనరిజం ఫ్యాన్స్ కి తెగనచ్చేసింది. దీనితో సామజిక మాధ్యమాలలో బీడీ తాగుతూ వీడియోలు చేస్తున్నారు. ఇది నచ్చని బన్నీ కేవలం సన్నివేశం కోసం బీడీ తాగాల్సివచ్చిందనీ..నిజానికి స్మోక్ చేసే అలవాటు నాకు లేదని అన్నారు. అలాగే మీరు స్మోక్ చేస్తూ నన్ను ఇమిటేట్ చేయడం నాకు నచ్చదు మరియు బాధకలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్న బన్నీ ఔదార్యాన్నీ మెచ్చుకోవాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa