దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. ఈ మూవీ తమిళంలో విజయవంతమైన ‘అసురన్’ కి రీమేక్. ఈ చిత్రం ‘అనంతపురం’లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది.ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడులోని ‘కురుమలై’లో షూటింగ్ జరుపుకుంటోంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి కనిపించనుంది. ఓ కీలకమైన పాత్ర కోసం అమలా పాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారు కావొచ్చట. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa