తన గార్ల్ ఫ్రెండ్ పల్లవి వర్మతో నిశ్చితార్ధం జరుపుకున్నాడు నటుడు నిఖిల్. ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్న వీరు ఎట్టకేలకి పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వీరి నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ ఇద్దరు ఫోటోలకి ఫోజులిచ్చారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa