అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ ఈ సాయంత్రం రివీల్ చేసింది టీమ్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్ ను పెట్టారు. మొత్తానికి టైటిల్ బాగా ఇంట్రస్ట్ గా ఉంది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నిలదొక్కుకొవాలని అఖిల్ ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa