ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ లో సత్తాచాటుతున్న విజయ్ దేవరకొండ మూవీ!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 01:48 PM

దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా  తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ మూవీ గత ఏడాది ఐదు భాషలలో గ్రాండ్ గా విడుదలైంది. మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు రష్మికల నటన హైలెట్ గా నిలిచింది. కాగా ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ రెండు వారాల క్రితం యూట్యూబ్ లో విడుదలైంది. ఈ చిత్రం అతి తక్కువ సమయంలో 1 వన్ మిలియన్ లైక్స్ మరియు 60 మిలియన్ వ్యూస్ దక్కించుకొంది. తక్కువ సమయంలో ఇంత ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం విజయ్ పాపులారిటీని తెలియజేస్తుంది. గోల్డ్ మైన్ టెలి ఫిలిమ్స్ ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులు దక్కించుకోగా వారికి ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక విజయ్ ఇటీవలే పూరి దర్శకత్వంలో చేస్తున్న కొత్త మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ముంబైలో జరిగిన ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa