టైగర్ ష్రాఫ్ తాజాగా 'భాఘీ' సిరీస్‌లో భాగంగా ‘భాఘీ 3’ సినిమా తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధానికి యాక్షన్ జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్నగా రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. ఇక ఈ చిత్రంలో మరోసారి టైగర్ ష్రాఫ్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో టైగర్ ష్రాఫ్ మరోసారి తన యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టాడు. ఇక హీరో అన్న రితేశ్ ఉద్యోగ రీత్యా సిరియా వెళతాడు. అక్కడ ఉగ్రవాదుల చేతిలో బందీ అవుతాడు. అన్నయ్యను విడిపించుకోవడానికి ఉగ్రవాదులతో పోరాడటానికి హీరో సిరియా వెళతాడు. ఈ పోరాటంలో ఉగ్రవాదులతో పోరాడి హీరో తన అన్నను రక్షించుకున్నాడా లేదా అనేది ‘భాఘీ 3’ స్టోరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa