ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమాలో అనసూయ, కియారా..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 02:58 PM

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మొఘలాయిల కాలం నాటి పీరియడ్ నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిచబోతున్నాడని, ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఓ కీ రోల్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక అనసూయ రోల్ కూడా ఈసినిమాలో దాదాపు 30నిమిషాల నిడివి కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ అని తెలుస్తుంది. అలాగే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలకు ప్రధాన్యమున్న ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ పేరు మొదటి హీరోయిన్ గా ఖరారైనట్లుగా చెబుతున్నారు. కియారా ఎంత పారితోషకం అడిగినా.. ఇవ్వడానికి క్రిష్ నిర్మాత ఏ ఏం రత్నం వెనుకాడలేదు కాబట్టి... కియారా, పవన్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లుగా ప్రచారమైతే జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa