మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అని టైటిల్ ఖరారైనట్లు ఆ వార్తల సారాంశం. దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్లో ఆచార్య అని టైటిల్ కూడా రిజిస్టర్ అయింది అని కూడా ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో మెగాస్టార్ ప్రొఫెసర్ పాత్రలో కన్పించనున్నాడు. గతంలో వచ్చిన మాస్టర్,ఠాగూర్ తర్వాత చాలా ఏళ్లకు చిరు ప్రొఫెసర్ పాత్రలో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa