ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమౌళి కారణంగా ఎన్టీఆర్ కు సరికొత్త రికార్డ్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2020, 01:46 PM

బిగెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ ఆర్ ఆర్' విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఎన్టీఆర్ ఊహించని ఒక కొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు గడిచిపోయింది. మొదట్లో చాల వేగంగా సినిమాలు చేసిన ఎన్టీఆర్ తనకు టాప్ హీరో స్టేటస్ వచ్చిన తరువాత తన వేగాన్ని తగ్గించుకుని ఖచ్చితంగా తన వైపు నుండి సంవత్సరానికి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. 2018 దసరా రేసుకు వచ్చిన 'అరవింద సమేత' తరువాత ఎన్టీఆర్ రాజమౌళి బంధిఖానాలోకి వెళ్ళి పోవడంతో గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడ ఎన్టీఆర్ నుండి సినిమాలు లేని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతోంది.
ఒక టాప్ హీరో రేంజ్ వ్యక్తికి రెండేళ్ళ పాటు ఏ సినిమా లేకుండా దూరంగా ఉండటం అంటే అభిమానులతో చాల గ్యాప్ ఏర్పడుతుంది. దీనికితోడు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కూడ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కనీసం ఫిలిం ఫంక్షన్స్ లో కూడ ఎన్టీఆర్ కనిపించడం లేదు. దీనితో రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' నమ్ముకుని ఎన్టీఆర్ తన విలువైన రెండు సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకుంటున్నాడు అంటూ తారక్ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు.
అంతేకాదు అంచనాలకు అనుగుణంగా 'ఆర్ ఆర్ ఆర్' ఘన విజయం సాధించినా ఆ ఖ్యాతి రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్ చేసిన త్యాగానికి ఏమి విలువ ఉంటుంది అంటూ కొందరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు 'ఆర్ ఆర్ ఆర్' విడుదల వాయిదా విషయం తెలుసుకుని తీవ్ర నిరాశ పడుతున్నారు. అయితే రాజమౌళి ఎన్టీఆర్ ల కెరియర్ ఒకే సినిమాతో మొదలైన పరిస్థితులలో వీరిద్దరి సాన్నిహిత్యాన్ని ఈ గ్యాప్ వీరిద్దరిని మరింత దగ్గర చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa