కథానాయికగానే కాకుండా అడపాదడపా స్పెషల్ సాంగ్‌లతోను అలరిస్తున్న అందాల భామ తమన్నా. ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో కథానాయికగా నటిస్తుంది. మాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా నటిస్తుండగా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ పాత్రలో మెరవనుంది. తాజాగా చిత్రం నుండి తమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. జ్వాలా రెడ్డి అనే పాత్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా కోచ్ కనిపించనుందని పోస్టర్ ద్వారా తెలిపారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది.
సీటీమార్ చిత్రంలో బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది . హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మరో హీరోయిన్‌గా హిప్పీ బ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమాతో దర్శకుడు తనయుడు యువ నంది వెండితెరకి పరిచయం కానున్నాడు. నా తనయుడు యువ ఈ చిత్రంలో కామియో రోల్ పోషిస్తున్నాడు అని సంపత్ నంది రీసెంట్‌గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Now fire has a name - Jwala Reddy @tamannaahspeaks #Seetimaarr Kabaddi.. Kabaddi.. Kabaddi@SS_Screens @YoursGopichand @DiganganaS @bhumikachawlat pic.twitter.com/TLpUNaFVDu
— Sampath Nandi (@IamSampathNandi) February 8, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa