సినిమా టేకింగ్ ని, దర్శకుడి విజన్ ని చూసి ఖైదీ సినిమాకు అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోగా నటించడానికి మరో స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా మక్కువ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కానగరాజ్ హిందీలోనూ సినిమాను తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమా ఛాన్స్ హృతిక్ కి దక్కుతుందా..? లేక రణవీర్ సొంతం చేసుకుంటాడా అని తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa