తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి అమైరా దస్తూర్. ఈ ఫోటోలకు “అంతు చిక్కని.. ఆకర్షణీయమైన.. సాధారణమైన అవగాహనకు అందని” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అమైరా తన గురించి కొంచెం తాత్వికంగా సాధారణ ప్రజల భావాలకు అందని భావం ఏదో వ్యక్తపరిచినట్టుగా ఉంది. ఈ ఫోటోలో గ్రీన్ కలర్ టాప్ పోల్కా డాట్స్ తరహాలో కనిపించే డిజైన్ తో వైట్ స్కర్ట్ ధరించి సెన్సువల్ పోజిచ్చింది. మ్యాచింగ్ షూ ధరించింది. గుండీలు అసలు లేకుండా ఒకే ముడివేసి ఆ ముడి చివరను ఒక తాడులా వేలాడదీయడంతో అందులో కళాత్మకత ఉట్టిపడుతోంది. ఈ స్థాయిలో ఫోటోషూట్ చేస్తే హాట్ నెస్ లేకపోతే ఎలా అందుకే కాస్త ఘాటుగా అందాలను కూడా వడ్డించింది. ఇలాంటి ఫోటోలు ఫాలోయర్లకు నచ్చుతాయి. ఈ ఫోటో కూడా నచ్చింది. అందుకే మంచి కామెంట్లు పెట్టారు. “ఆసమ్ మేడమ్”.. “స్టన్నింగ్ డ్రెస్” అంటూ కామెంట్లు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa