ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో సారి ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో రష్మిక మందన్న?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 02:54 PM

పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగ చైతన్య హీరోగా కొత్త చిత్రాన్ని కమిటయ్యారు. ఈ చిత్రం కూడా పరశురామ్ గత సినిమాల తరహాలోనే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండనుంది. ఈ చిత్రం అంతటి విజయాన్ని సాధించడానికి గల ముఖ్య కారణాల్లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఒకరు. ఆమె పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. అందుకే పరశురామ్ మరోసారి ఆమెతో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా రష్మిక అయితే బాగుంటుందని ఆమెనే కథానాయకిగా ఎంచుకున్నారట పరశురామ్. మరి ఈ చిత్రం కూడా ‘గీతా గోవిందం’ తరహాలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తికాగానే ఈ చిత్రం మొదలుకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa