ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్స్ డే రోజున నాగచైతన్య 'లవ్ స్టోరీ' నుంచి 'ఏయ్ పిల్లా' సాంగ్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 03:49 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయినిగా  'లవ్ స్టోరీ' రూపొందుతోంది.  ఈ సినిమాపై యూత్ లో మంచి ఆసక్తి వుంది. ఇది లవ్ స్టోరీ  కావడం వలన, ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'ఏయ్ పిల్లా' సాంగ్ ను విడుదల చేయనున్నారు. 'ఫిదా' మూవీ  హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న  సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. 'ఫిదా'లో సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడితే, ఈ సినిమాలో  తెలంగాణ యాసలో మాట్లాడనున్న హీరో నాగ చైతన్య  .  ఈ సినిమా కోసం ఆయన తెలంగాణ యాస నేర్చుకోవడం విశేషం. నారాయణ దాస్ నారంగ్ .. రామ్ మోహన్ రావ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్  లో రిలీజ్ కానుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa