ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 13న సోలో బ్రతుకే థీమ్ వీడియో!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 04:42 PM

 ప్రతి రోజు పండగే చిత్రాలతో హిట్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి బ్యానర్‌పై బి వి ఎస్  ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తాలూకా థీమ్ వీడియో ను ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 13న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న టీమ్ ఈ వీడియో తో ఎలాంటి ఆసక్తి కనపరుస్తారో చూడాలి. మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. థమన్ మ్యూజిక్, వెంకట్ సి దిలీప్ ఫోటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa