ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాలకి వెళుతున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎందుకంటే?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 04:24 PM

నటనలో శిక్షణ కోసం విదేశాలకి వెళ్లనున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ . తన మొదటి సినిమా తో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  అయితే మోక్షజ్ఞకి నటన పట్ల ఆసక్తి లేదనే టాక్ ఆ మధ్య వినిపించింది. ఆయనకి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడం .. అందులో మోక్షజ్ఞ చబ్బీగా ఉండటం చూసి, ఇక ఆయనకి సినిమాలోకి  వచ్చే ఆలోచన లేదని అనుకున్నారు. కానీ నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనని న్యూయార్క్ పంపిస్తున్నటు  తెలుస్తోంది. 'న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్'లో శిక్షణ నిమిత్తం ఆయనను పంపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టార్ హీరోల పిల్లలు  చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa