ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`శక్తి`గా రానున్న‌ శివ కార్తికేయ‌న్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 04:05 PM

త‌మిళ - తెలుగు భాష‌ల్లో `అభిమ‌న్యుడు` చిత్రంతో స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు పి.య‌స్‌. మిత్ర‌న్‌. ఆయ‌న డైర‌క్ట్ చేసిన లేటెస్ట్ త‌మిళ మూవీ `హీరో` తెలుగులో `శ‌క్తి` పేరుతో విడుద‌ల కానుంది.  డైనమిక్ స్టార్ శివ కార్తికేయ‌న్ ఇందులో హీరోగా న‌టించారు. యాక్షన్  కింగ్‌ అర్జున్ కీల‌క పాత్రధారి . బాలీవుడ్ న‌టుడు అభ‌య్ డియోల్‌కి  సౌత్ ఇండియాలో తొలి సినిమా ఇదే. విద్యావ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ శంక‌ర్ తెర‌కెక్కించిన  జెంటిల్‌మేన్  చిత్రం గుర్తుకొస్తుంది. అందుకు ఏమాత్రం తీసిపోని క‌థ‌తో పి.య‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమా`శ‌క్తి`. శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో సామాజిక స్పృహ ఉన్న  క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రిజిస్టర్  అయింది ఈ మూవీ. కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కోటపాడి జె రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత .  క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ నాయిక‌. ఇవాన కీల‌క పాత్ర‌లోన‌టించారు.  డైర‌క్ట‌ర్ పి.య‌స్‌.మిత్ర‌న్ సినిమా గురించి మాట్లాడుతూ ``సూప‌ర్ హీరోల ప‌ట్ల మ‌న‌కుఎప్పుడూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. శక్తిమాన్ సీరియ‌ల్‌ని అంత తేలిగ్గా  మ‌ర్చిపోలేం. ఆ సీరియ‌ల్ ప్రభావంతో సూప‌ర్‌మేన్ అవుదామ‌నుకున్న ఓ అబ్బాయి... రియ‌ల్ లైఫ్‌లో చేసిన స్టంట్‌లు ఏంటి? తండ్రి  స‌ల‌హాతో లైఫ్‌లో  ఎలా సెటిల‌య్యాడు? అత‌ను చేసిన సూప‌ర్  మేన్   త‌ర‌హా ప‌నులేంటి? మ‌న విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అత‌నికి గుర్తు చేసిందెవ‌రు? అత‌ను బాగు చేసిందేంటి? వ‌ంటి విష‌యాల‌న్నీ ఇందులోఆస‌క్తిక‌రంగా ఉంటాయి. త‌మిళంలో ఈ సినిమాకు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. యూనివర్సల్  స‌బ్జెక్ట్ కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు కూడా అంతే ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ క‌థ‌లో వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను చాలా చొప్పించాం. ప్రేక్ష‌కుల‌కు ఓ వైపు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని క‌లిగిస్తూనే ఆలోచింప‌జేసేలా ఉంటుందీ సినిమా`` అనిచెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa