ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా ‘అరణ్య’ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 07:00 PM

రానా దగ్గుబాటి నటించిన బహుభాషా చిత్రం ‘అరణ్య’ టీజర్ గురువారం సాయంత్రం విడుదలయింది. అడవిని కాపాడే వ్యక్తిగా రానా నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. మానవులు-జంతువుల మధ్య సంబంధాలను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ లో కూడా విడుదల అవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా.. పోస్డ్ ప్రొడక్షన్స్ పనుల్ని పూర్తి చేసుకుని అన్ని భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో రానా అడవిలో ఉండే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa