ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరస సినిమాలతో జోరు పెంచిన నితిన్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 02:14 PM

హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రం అన్ని పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుదలకానుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఇది కూడా లవ్ స్టోరీనే. దాని తర్వాత చిత్రం చంద్ర శేఖర్ యేలేటి తో చేస్తున్న విషయం కూడా ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు నితిన్. ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ పెట్టగా ఎక్కువ శాతం జైల్లోనే చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు. అక్కడితో అయిపోలేదు. నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఈ రీమేక్ ను మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నాడు. వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలై, ఇయర్ ఎండింగ్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అని 2 సినిమాల సిరీస్ ను చేయనున్నాడు నితిన్. ఈ ఏడాది ఆఖర్లో సినిమా షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే ఈ రెండు సినిమాలను విడుదల చేయబోతున్నాడు. అంటే ఏడాదిన్నర గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాల రిలీజ్ లు అన్నమాట. ఈ ఏడాది చివర్లో మరిన్ని స్క్రిప్ట్ లను వినాలని డిసైడ్ అయ్యాడు ఈ కొత్త పెళ్లి కొడుకు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa