ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ యంగ్ హీరో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొడతాడా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 04:12 PM

‘ఉప్పెన’ చిత్రంతో మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే.  కాగా ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఈ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ లవ్ ట్రాక్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీక్వెన్స్ కూడా మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందట. ముఖ్యంగా విజయ్ సేతుపతి – వైష్ణ‌వ్‌ తేజ్ మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా చాల బాగుంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మెగా హీరో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa