ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ సినిమా లో భూమిక ...

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 11:15 AM

పవన్ అభిమానులకే మాత్రమే కాదు తెలుగు సినీ ప్రేక్షకుడు సైతం ఖుషి సినిమాని ఎప్పటికి మరిచిపోలేడు.. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ , భూమిక సిద్ధు, మధుమతి పాత్రలలో జీవించారు. ఇది పవన్ కి ఏడో సినిమా.. అప్పటికే మంచి హిట్స్ తో దూసుకుపోతున్న పవన్ కి ఈ సినిమా మరింత హిట్ అయి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భూమిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. పవన్ ఫాలోయింగ్ కి లెక్కే లేదు. ఇందులో పవన్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా కానీ అభిమాని ఉండడు. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది ఖుషి


అయితే ఈ సినిమా తర్వాత పవన్, భూమిక కలిసి నటించింది లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ జోడి స్క్రీన్ పైన కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ మూవీగా పింక్ రిమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి ఇది 26 వ సినిమా.. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాని చేస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది.


అయితే ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర కోసం భూమికను ఎంపిక చేశారని తెలుస్తోంది. 'ఖుషి' చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎమ్‌.రత్నమే ఈ సినిమాని కూడా నిర్మిస్తుండటంతో సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అవుతుందని భూమికను తీసుకున్నారని వినిపిస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఇక ఇప్పటికే భూమిక రీఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఇక పవన్, క్రిష్ మూవీకి హీరోయిన్ గా సోనాక్షి సిన్హా, ప్రగ్యా జైస్వాల్, నిధి అగర్వాల్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు పవన్ .. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది!


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa