ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ మరో మూవీకి సైన్ చేసే అవకాశాలున్నాయా ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 06:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పింక్’ తెలుగు రీమేక్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది ఆరంభానికల్లా పూర్తైపోతాయి. పవన్ 2021లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో పెద్ద నిర్మాతలు ఆయన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా ఒక నిర్మాత పవన్ వద్దకు సినిమా చేయాలనే ప్రతిపాదనను పంపగా పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ నుండి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa