తమిళ నటుడు ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది బాలీవుడ్ నటి సయేషాసైగల్. ఈ జంట ఐడియల్ కపుల్ గా పాపులరయ్యారు. మ్యారేజ్ తర్వాతా ఈ అమ్మడిలో హాట్ కంటెంట్ ఏమాత్రం తగ్గినట్టే లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ థై స్లిట్ డ్రెస్ లో ఆ ఫోజు చూస్తుంటే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇకపైనా బుల్లితెర షోలు.. వెబ్ సిరీస్ లు.. ఓటీటీ అంటూ బోలెడన్ని అవకాశాలు ఎలానూ ఉన్నాయి కాబట్టి సయేషా ఆ దిశగా ఆలోచిస్తోందా అన్నది చూడాలి. పెళ్లయ్యాకా అనుష్క శర్మ- దీపిక పదుకొనే- సమంత స్టార్లుగా కొనసాగుతున్నారు. నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. మరి సయేషా ప్లాన్స్ ఏమిటో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa