ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌థ‌ను చెప్ప‌గానే.. వెంట‌నే చేయాల‌నిపించింది: నాని

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 04:23 PM

నిర్మాత‌ నాని మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ శైలేష్ ఈ క‌థ‌ను చెప్ప‌గానే.. వెంట‌నే చేయాల‌నిపించింది. త‌ను క‌థ‌లు రాస్తుంటాడు. త‌ను బాగా చ‌దువ‌కున్న వ్య‌క్తి. త‌ను సినిమాల్లోకి వ‌స్తానంటే ఎంక‌రేజ్ చేస్తూనే కొంచెం జాగ్ర‌త్త‌లు చెబుతూ వ‌చ్చాను. జాబ్ వ‌దిలి రాకు అని త‌న‌కు ఎప్పుడూ చెబుతుంటాను. త‌ను క‌థ చెప్ప‌గానే సరే! ఓ సినిమా మాత్రం చెయ్ అని చెప్పాను. కానీ సినిమా చూసిన త‌ర్వాత చెబుతున్నాను.. శైలేష్ నువ్వు జాబ్‌కి రిజైన్ చెసెయ్ అని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ఈ సినిమాతో శైలేష్ డైరెక్ట‌ర్‌గా ఎంటో నిరూపించుక‌న్నాను. ఈ సినిమా చూస్తే ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ చేసిన సినిమా అనిపించ‌దు. ఇక విశ్వ‌క్ గురించి చెప్పాలంటే.. హీరోగా విశ్వ‌క్‌ను అనుకుంటున్న‌ప్పుడు త‌న గురించి ఏం తెలియ‌దు. క‌టౌట్ బావుంద‌ని అనుకున్నాను. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కాబ‌ట్టి త‌ను సూట్ అయిపోతాడ‌నిపించింది. ఈరోజు సినిమా చూసిన త‌ర్వాత త‌ను ఏ రోల్ అయిన ఇర‌గ‌దీస్తాడ‌నిపించింది. రుహాని చాలా బాగా చేసింది. వివేక్ సాగ‌ర్‌.. చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. త‌నొక హీరో పాత్ర‌ను పోషించాడు. త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎడిట‌ర్ గ్యారీకి థాంక్స్‌. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఎడిట‌ర్ అంటే గ్యారీనే గుర్తుకొస్తాడు. నేను , ప్ర‌శాంతి క‌లిసి చేసిన అ! సినిమాను క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ..నిర్మాత‌గా అ! సినిమా చాలా పెద్ద స‌క్సెస్‌. దాన్ని మించి `హిట్` సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు నిర్మాత‌లు త‌ర‌పున థాంక్స్‌. ఈ నెల 28న ప్రేక్ష‌కుల‌కు ఎంగేజింగ్‌, ఎంట‌ర్‌టైనింగ్ సినిమాను ఇస్తున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను`` అన్నారు. 


హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ - ``సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్‌గారు న‌న్ను ఎంతో బాగా చూపించారు. నేను చ‌నిపోయే లోపు త‌న‌తో డ‌జ‌ను సినిమాలైనా చేస్తాన‌ని అనుకుంటున్నాను. వివేక్‌సాగ‌ర్‌తో మూడోసారి ప‌నిచేస్తున్నాను. త‌ను నా సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతం అందించాడు. రుహాని టెరిఫిక్ పెర్ఫామర్‌. ఎడిట‌ర్ గ్యారీ ఎక్స‌లెంట్‌గా ఎడిట్ చేశారు. ఓ సీన్ కూడా మిస్ కాకుండా చూడాల‌నుకుంటారు. నిర్మాత ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. చాలా మంచి వ్య‌క్తి. నాని అన్న విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న చాలా స్మార్ట్‌. త‌ను ఇచ్చిన స‌ల‌హాతో నా పాత్ర‌ను బాగా చేయ‌గ‌ల‌ను. డైరెక్ట‌ర్ శైలేష్‌ను నేను సైంటిస్ట్ అని అంటాను. అంద‌రికీ డౌట్ ఉంటే తెలుసుకుంటాం. శైలేష్ మాత్రం.. చ‌దివేస్తాడు. త‌ను చాలా ఇంటెలిజెంట్‌. సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తొలి నిమిషాలు మీరు కూర్చుంటే త‌ర్వాత నేను మిమ్మ‌ల్ని కూర్చొని పెడ‌తాను. సినిమా చూసిన త‌ర్వాత క‌చ్చితంగా మాట‌లు రావు. ఎందుకంటే నేను అలా ఎక్స్‌పీరియెన్స్ ఫీల‌య్యాను. ప్రేక్ష‌కులు అలాగే ఫీల్ అవుతారు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి థ్రిల్ల‌ర్ రాలేదు. ఈసారి డైలాగ్స్ పెద్ద‌గా లేదు.. డైరెక్ట్‌గా బుల్లెట్ దింపుడే`` అన్నారు. 


డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ - ``ముందుగా మా కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌. 2017లో ఈ సినిమా కోసం నానిని క‌లిశాను. ముందు నేను డైరెక్ష‌న్ చేయ‌డానికి రాలేదు. క‌థ‌ను రాసి నానికి ఇస్తే త‌ను మ‌రొక‌రితో డైరెక్ట్ చేయించుకుంటాడ‌నుకున్నాను. క‌థ విన్న నాని.. బాగా రాసుకున్నావుగా.. నువ్వే డైరెక్ట్ చెయ్ అని నాని అన్నాడు. నాకంత స్కిల్ లేదు అని నేనంటే క‌థ‌ను ఇంత బాగా రాసుకున్నావుగా నువ్వే డైరెక్ట్ చెయ్ అన్నాడు. మ‌ళ్లీ సిడ్నీకి వెళ్లి డైరెక్ష‌న్ మెళుకువ‌లు నేర్చుకున్నాను. అలా నాని నా లైఫ్‌లో మార్గ‌ద‌ర్శిలా మారాడు. న‌న్ను డైరెక్ట‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ చేసినందుకు నానిగారికి థాంక్స్‌. ఆయ‌న నాపై పెట్టుకున్న న‌మ్మ‌కం వ‌ల్ల ఓ భ‌యంతో సినిమాను బాగా తీశాన‌నే అనుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేస్తానో లేదో తెలియ‌దు కానీ.. నాని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అలాగే ప్ర‌శాంతిగారికి థాంక్స్‌. ఎగ్రెసివ్‌గా ఉండే హీరో కావాలి.. అనుకుని త‌న‌ను వెళ్లి క‌లిశాను. ఐదు నిమిషాల్లో ఇద్ద‌రం క‌లిసిపోయాం. త‌ను నా ప్రాజెక్ట్‌లోకి రావ‌డం వ‌ల్ల నేను అనుకున్న ఔట్‌పుట్ క‌న్నా రెండింత‌లు బాగా వ‌చ్చింది. మ‌ణికంద‌న్‌గారికి, ఎడిట‌ర్ గ్యారీకి అభినంద‌న‌లు. వివేక్‌సాగ‌ర్ ఎక్స్‌ట్రార్డిన‌రీ బీజీఎం అందించాడు. నా సినిమాకు ప‌నిచేసిన టెక్నిషియ‌న్స్ కార‌ణంగా సినిమా మ‌రో లెవ‌ల్‌కు వెళ్లింది. రుహాని చాలా నేచుర‌ల్‌గా చేసింది. ఎంటైర్ యూనిట్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. 


అల్ల‌రి న‌రేశ్ మాట్లాడుతూ - ``మంచి కంటెంట్ సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తామ‌ని `అ!` సినిమాతో నాని, ప్ర‌శాంతి నిరూపించారు. నాని ఈ సినిమా గురించి నాకు చాలానే చెప్పాడు. విశ్వ‌క్ ఫెంటాస్టిక్ యాక్ట‌ర్‌, శైలేష్‌గారికి, వివేక్‌సాగ‌ర్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు. 


డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``నేను `ఓ బేబీ`సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు విశ్వ‌క్ `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. త‌ను మాట్లాడిన మాటొక‌టి త‌ప్పుగా వెళ్లిపోయింది. నేను విశ్వ‌క్‌ను రామానాయుడు స్టూడియోలో క‌లిసి నీకు కాంట్ర‌వ‌ర్సీలు అవ‌స‌రం లేదు. నీ టాలెంట్‌ను న‌మ్ముకో అని చెప్పాను. ఇప్పుడు హిట్ సినిమా త‌న టాలెంట్‌కు ఓ చిన్న ఎగ్జాంపుల్ మాత్ర‌మే. త‌ను భ‌విష్య‌త్తులో హిట్‌తో పాటు బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా కొడ‌తాడు. నాని, ప్ర‌శాంతి మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేస్తున్నారు. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు`` అన్నారు. 


సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``ఇద్ద‌రు భిన్న‌మైన వ్య‌క్తుల క‌ల‌యికే హిట్ సినిమా. నాని మంచి న‌టుడే కాదు.. చాలా తెలివైన వ్య‌క్తి. త‌ను న‌న్ను చాలా ఇన్‌స్పైర్ చేస్తుంటాడు. విశ్వ‌క్ కాన్ఫిడెంట్ మ‌రో లెవ‌ల్‌లో ఉంటుంది. వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. 


రుహాని మాట్లాడుతూ - ``ఇది నా సెకండ్ మూవీ. చాలా పొటెన్షియ‌ల్‌తో చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. శైలేష్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. రాత్రింబ‌గ‌ళ్లు సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి అభినంద‌న‌లు`` అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa