‘థప్పడ్’ షూటింగ్ ముగిశాక ఆ మూవీలో తాను పోషించిన పాత్ర ప్రభావం నుంచి బయటపడేందుకు నెల రోజులు పట్టిందని నటి తాప్సీ తెలిపింది. ఈ పాత్ర తనకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఆత్మాభిమానం నిలబెట్టుకునేందుకు చెంపదెబ్బతో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. తాను ఏ పాత్ర పోషించినా ఎంతో భావోద్వేగానికి లోనవుతానని, దాని నుంచి బయటపడేందుకు కొంత సమయం పడుతుందని చెప్పింది. సందేశాత్మక చిత్రంగా ‘థప్పడ్’ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa