శర్వానంద్, సమంతలు జంటగా కలిసి నటించిన సినిమా ‘జాను’. ఇది ’96’కి రీమేక్‌గా తీశారు. ఇప్పటికే "96" మూవీని చాలామంది తెలుగువాళ్లు కూడా చూసే ఉంటారు. ప్రతీ సన్నివేశం హృద్యంగా, ఓ దృష్యకావ్యంలా ఉంటుంది. అంతలా ఆ మూవీ ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది గనుకే.. ఆ సినిమాను ఎంతో ఇష్టపడి తెలుగులోకి కూడా రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు . కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేదు.
నటిగా సమంతకు పదేళ్లు నిండటంతో సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి నెటిజన్ల ప్రేమకు సమంత ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ఏమాయ చేశావే చిత్రం వచ్చి పదేళ్లు గడవడం, ఈ దశాబ్దంలో సమంత సాధించిన విజయాలు.. చూసిన ఎత్తుపల్లాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లాయాక కూడా సమంత స్టార్ హీరోయిన్‌గా కొనసాగడటం.. పెళ్లి తరువాతే సౌత్ ఇండియన్ స్టార్‌గా మారడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాను చిత్రంపై, బాక్సాఫీస్ కలెక్షన్లపైనా కామెంట్ చేసింది.
బాక్సాఫీస్ లెక్కలను పక్కన బెడితే జాను చిత్రం నన్నెంతో మార్చింది.. ఈ చిత్రం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను.. ఈ లెక్కన జాను చిత్రానికి నేనెప్పుడు గర్వంగా ఫీలవుతానంటూ ట్వీట్ చేసింది. పెళ్లాయక కూడా సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నందుకు, సమాజం చేసే కామెంట్లను ఎదుర్కొంటూ నిలబడ్డ సమంత ఎందరికో స్ఫూర్తి అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa