వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరో గా, రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా భీష్మ ఈ మంచి సక్సెస్ ని సాధించింది. ప్రస్తుతం భీష్మ మూవీ టీమ్ మంచి జోష్‌లో ఉంది. తమ సినిమాకు ఆశించిన ఫలితం రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు యూనిట్ సభ్యులంతా. ఇది అంత ఒక ఎత్తు అయితే , టాలీవుడ్ హీరోల మధ్య పోటీ సంగతి పక్కన బెడితే ఒకరి సినిమా కోసం మరొకరు తమ వంతు సహకారం అందిస్తూ తెలుగు చిత్రసీమలో ఉన్న ఫ్రెండ్లీ వాతావరణాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో నితిన్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైజాగ్ పయననానికి సిద్దమయ్యాడు. నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ భారీ సక్సెస్ సాధించింది. ఈ మేరకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు గాను ఫిబ్రవరి 29వ తేదీన వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో భీష్మ థాంక్స్ మీట్ నిర్వహించబోతోంది చిత్రయూనిట్. అత్యంత గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa