ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కనులు కనులను దోచాయంటే' మూవీ రివ్యూ..

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2020, 01:53 PM

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
నటీనటులు :  దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షణ్, గౌతమ్ మీనన్, నిరంజని తదితరులు..
దర్శకత్వం : దేసింగ్ పెరియస్వామి
నిర్మాత‌లు : వియాకామ్ 18స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ.
సంగీతం :  మసాలా కాఫీ అండ్ హర్ష వర్ధన్
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కనులు కనులను దోచాయంటే నేడు విడుదలైంది. లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథ:
మంచి మిత్రులైన సిద్దార్థ(దుల్కర్ ), కలీస్(రక్షణ్) ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. సిద్దార్ధ్ సంప్రదాయం మంచి పద్ధతులు కలిగిన అనాధ మీరా(రీతూ వర్మ) ప్రేమలో పడతాడు. ఓ పెద్ద మోసం చేసి బాగా డబ్బులు సంపాదించిన అనంతరం సిధార్థ, కలీస్ వాళ్ళ లవర్స్ అయిన మీరా మరియు అతని స్నేహితురాలితో కలిసి గోవాలో సెటిల్ అవ్వాలని అక్కడికి వెళతారు. గోవా వెళ్లిన వీరిని పోలీస్ లు పట్టుకోవడం జరుగుతుంది. ఆ తరువాత వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వీరితో వెళ్లిన మీరా అతని స్నేహితురాలు ఏమయ్యారు? చివరకు సిద్ధూ, మీరాల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి…
ప్లస్ పాయింట్స్:
కనులు కనులను దోచాయంటే ఇప్పటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిన న్యూ ఏజ్ క్రైమ్ డ్రామా అనిచెప్పాలి. నిజంగా ఆన్లైన్ బిజినెస్ లో కస్టమర్స్ పాల్పడే మోసాలను లాజికల్ గా చెప్పడం జరిగింది.
హీరో హీరోల మధ్య రొమాన్స్ మరియు లవ్ కంటే ఈ చిత్రం ఆద్యంతం క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది. మోసాలకు పాల్పడే హీరో గ్యాంగ్ అనుసరించే మార్గాలు, పద్ధతులు చాల కన్విన్సింగ్ గా వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి.
ప్రతి ప్రాడ్ ని చాలా చకాచక్యంగా ప్లాన్ చేసే ఇంటెలిజెంట్ టెక్కీగా దుల్కర్ సల్మాన్ నటన చాల బాగుంది. అతను ఈ మూవీలో చాల హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఇక హీరో పాత్రకు సమాన నిడివి గలిగిన స్నేహితుడు రోల్ చేసిన రక్షణ్ సినిమాకు మంచి సపోర్ట్ గా నిలిచాడు. హీరో చేసే మోసాలలో తోడుండే మిత్రుడిగా అతని నటన చాల సహజంగా ఉంది. అలాగే అతను చేసే సిట్యువేషనల్ కామెడీ, టైమింగ్ పంచెస్ నవ్విస్తాయి.
చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కించుకున్న రీతూ వర్మ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ యువతిగా, మోడరన్ లేడీగా రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో ఆమె చక్కని వేరియేషన్స్ చూపించారు. ఇక ఆమె ఫ్రెండ్ రోల్ చేసిన నిరంజని పాత్ర పరిధిలో మెప్పించింది.
పోలీస్ అధికారిగా సీరియస్ ఇంటెన్స్ లుక్ లో దర్శకుడు గౌతమ్ మీనన్ అదరగొట్టాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆటిట్యూడ్ పాత్రకు చక్కగా సరిపోయాయి. ఆయన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో వేగంతో కూడుకున్న చక్కని స్క్రీన్ ప్లే, మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో ముగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కొంచెం స్లో గా మొదలుపెట్టారు. ఇంటర్వెల్ తరువాత మూవీ ఓ పదినిమిషాలు బోర్ గా సాగుతుంది.
ఎవరినైనా తన మాస్టర్ బ్రెయిన్ తో బోల్తా కొట్టించే ఇంటెలిజెంట్ హీరో ఇద్దరు ఆడవాళ్లను నమ్మి, తేలికగా మోసపోవడం నమ్మబుద్ది కాదు.
ఇక ఫస్ట్ హాఫ్ లో కథలో కీలకంగా మారి సీరియస్నెస్ క్రియేట్ చేసిన గౌతమ్ మీనన్ పాత్రను సెకండ్ హాఫ్ లో సిల్లీగా తేల్చేయడం నచ్చదు. సెకండ్ హాఫ్ లో ఆయన రోల్ వీర లెవెల్ లో ఉంటుంది… అనుకుంటే కామెడీగా ముగించారు. క్లైమాక్స్ సైతం ఇంకా కొంచెం ఆసక్తిగా మలిచివుంటే బాగుండేది.
ఇక ఈ టైటిల్ చూసి ఇదేదో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అనుకుంటే పొరపాటే…ఇది పక్కా క్రైమ్ డ్రామా..ఆ ఉద్దేశ్యంతో వెళ్లేవారు నిరాశపడే అవకాశం కలదు.
సాంకేతిక విభాగం:
సిట్యువేషన్ కు తగ్గట్టు వచ్చే సాంగ్స్ పర్వాలేదు, బీజీఎమ్ అలరిస్తుంది. కెమెరా వర్క్ సూపర్ అని చెప్పాలి. చాలా షాట్స్ లో కెమెరామెన్ క్రియేటివి కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా కథకు తగట్టుగా సాగింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఇక దర్శకుడు సమకాలీనంగా జరుగుతున్న ఆన్లైన్ కామర్స్ మోసాలు, హైటెక్ చీటింగ్స్ వంటి విషయాలకు లవ్ ఎమోషన్స్ కి మిక్స్ చేసి తీయడం బాగుంది. అలాగే కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ ప్రారంభంతో పాటు క్లైమాక్స్ ఇంకా కొంచెం ఆసక్తికరంగా మలచివుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
తీర్పు:
లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం చాలా వరకు ఆకట్టుకుంటుంది. సమకాలీన హైటెక్ మోసాలను ప్రస్తావిస్తూ లవ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసి తీసిన ఈ చిత్రం కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా, సిట్యువేషనల్ కామెడీ మరియు సీరియస్ క్రైమ్ తో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదు. కాకపోతే సెకండ్ హాఫ్ ప్రారంభ సన్నివేశాలు, క్లైమాక్స్ ఇంకా ఆసక్తికరంగా రాసుకొని ఉంటే మూవీ మరో స్థాయిలో ఉండేది.
రేటింగ్ : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa