ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో 'హిట్' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2020, 12:51 PM

విస్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన తాజా చిత్రం 'హిట్'. నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరి నేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం. తొలి వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది. మూడో రోజు అయిన ఆదివారం మొదటి రోజు కంటే వసూళ్లు ఎక్కువ నమోదవ్వడం విశేషం. ఇక తొలి వీకెండ్ లో 3.57 కోట్ల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఈ చిత్రం వీక్ డే అయిన సోమవారం నాడు డ్రాప్ చూపించింది. సాధారణంగా ఏ చిత్రానికైనా సోమవారం నాడు డ్రాప్స్ ఉంటాయి. హిట్ కూడా 50 శాతం మేర డ్రాపయింది. అయినా కానీ నాలుగో రోజు 45 లక్షల డీసెంట్ షేర్ ను సాధించింది. మొత్తంగా నాలుగు రోజులకు ఈ చిత్రం 4 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం విశేషం. తొలి వారం పూర్తయ్యేలోపు ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లనుంది.
హిట్ 4 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం : 2.27 కోట్లు
సీడెడ్ : 33.5 లక్షలు
గుంటూరు : 28.4 లక్షలు
ఉత్తరాంధ్ర : 40.5 లక్షలు
తూర్పు గోదావరి : 17.2 లక్షలు
పశ్చిమ గోదావరి : 17 లక్షలు
కృష్ణ : 27.5 లక్షలు
నెల్లూరు : 11 లక్షలు
ఆంధ్ర + తెలంగాణ : 4.02 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa