వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘వకీల్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా..మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ వచ్చి ట్రెండ్ సెట్ చేస్తుంది. అలాగే త్వరలో రానున్న ఫస్ట్ సింగిల్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని చిత్ర వర్గాలు చెపుతున్నారు. తాజాగా ఫస్ట్ సాంగ్ విన్న నితిన్ ..థమన్ గురించి ట్వీట్ చేస్తూ పాట చాలా అద్భుతంగా ఉందని విన్నానని అన్నారు. నితిన్ మాటలతో పాటపై అంచనాలు మరింత పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa