కరోనా వైరస్.. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని కబళించేందుకు రెడీ అయ్యింది. భారతదేశానికి.. హైదరాబాద్ కు వచ్చేసింది. 60 దేశాల్లో 90వేలకు మందికి పైగా సోకి 3వేల మందికి పైగా మరణాలకి కారణమైంది. వేల మంది చికిత్స పొందుతున్నారు.తాజాగా దుబాయ్ వెళ్లొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా సోకింది. అతడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అపోలో ఫౌండేషన్ నిర్వాహకురాలు ఉపాసన కొణిదెల తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని జాగ్రత్తలు, సూచనలను అందజేశారు. కరోనా వైరస్ వల్ల జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తాయని తెలిపారు. ఈ వైరస్‌ను యాంటీ బయాటిక్స్ అంతమొందించలేవని స్పష్టం చేశారు. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వండని మాంసం తినొద్దని ఆమె తెలిపారు. ‘దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే మాస్కు ధరించడం మేలు. దగ్గు, తుమ్ము లాంటివి వచ్చే వ్యక్తి నుంచి 3 అడుగుల దూరం ఉండటం మంచిది. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. హ్యాండ్ సానిటైజర్‌ను వెంట ఉంచుకోవాలి.’ అని ఉపాసన వెల్లడించారు.
Secunderabad @HospitalsApollo detected a case of #coronavirus due to strict screening protocols.
patient currently at Gandhi Hosp.
staff that cared for him are in quarantine.
Highest standards of infection control r being adopted .
Be responsible citizens & report symptoms. pic.twitter.com/OfVnWZd88S
— Upasana Konidela (@upasanakonidela) March 3, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa