ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీర్ అంటే చాలా ఇష్టం : వీణ నందకుమార్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2020, 08:54 AM

‘కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా’ అనే చిత్రంలో  నటించింది వీణ నందకుమార్. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ  నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను బీర్ ఎక్కువగా తాగుతానని తెలిపింది. తనకున్న తాగుడు అలవాటు వల్ల  ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని వీణ సమర్థించుకుంది. ఈ అలవాటును తనకు తానుగా చేసుకున్నానని చెప్పింది. తాను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి భయపడబోనని. అసలు ఈ విషయాన్ని చెప్పేందుకు తానెందుకు భయపడాలని వీణ ప్రశ్నించింది. తాగడం నేరమేమీ కాదని .. బీర్ తాగడం గురించి తాను ఎంతైనా మాట్లాడతానని, యువతకు బీర్ తాగడం ఇప్పుడు అలవాటుగా మారింది కదా అని చెప్పింది. ఈ   వ్యాఖ్యలపై  తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa