టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త సినిమా '18 పేజీస్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథను సుకుమార్ అందించారు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన మనవరాలు (బన్నీ కూతురు) అర్హను కూడా అల్లు అరవింద్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి' అని అల్లు అరవింద్ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్.. 'ఆమె మా చీఫ్ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్' అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మాతగా రూపుదిద్దుకుంటుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. '18 పేజీస్' టైటిల్ పోస్టర్‌ను నిఖిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గతంలో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా '18 పేజీస్' రూపుదిద్దుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa