ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తి రేపుతున్న అనుష్క "నిశ్శబ్దం" ట్రైలర్...

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2020, 12:58 PM

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్‌ ఈ రోజు హీరోనాని చేతుల మీదుగా విడుదలైంది. ‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’ విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించిన ఈ సినిమా బృందం సరిగ్గా అదే సమయానికి విడుదల చేసింది.


ఈ సినిమా  కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో వస్తోంది. ఈ సినిమాలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అంజలి డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. 'నేను చెబుతోంది అర్థమవుతుందా?', 'ఓ గోస్ట్ ఇదంతా చేస్తుందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నా సెన్సిబిలీటీస్‌ అంగీకరించలేదు' అంటూ ఆమె ఓ డైలాగ్ చెప్పింది.  


ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌కు మంచి టాక్‌ వచ్చింది. ట్రైలర్ కూడా అంచనాలను తగ్గట్లుగానే కట్‌ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది. వచ్చేనెల 2న ఈ సినిమా విడుదల చేస్తామని ఆ సినిమా బృందం ప్రకటించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa