ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకుమార్ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ..

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2020, 01:25 PM

మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది 'ఉప్పెన'. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన లుక్ లు, రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. క్యూట్ లుక్స్ తో అందరిని ఆకర్షిస్తుంది కృతి . లిరికల్ పాటలలో కృతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లకు చాలామంది ఫిదా అయ్యారు. ఇక దర్శకుడు సుకుమార్ కూడా అమ్మడి అందానికి మంత్రముగ్దులు అయ్యాడట. దీంతో ఆమెకు మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'కుమారి 21 ఎఫ్ ' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ '18 పేజెస్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాలో కృతి ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa